శివప్రసాద్ మరణం నన్ను కలిచివేసింది – మోహన్ బాబు

శివప్రసాద్ మరణం నన్ను కలిచివేసింది – మోహన్ బాబు

Published on Sep 22, 2019 12:01 PM IST

సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు నారమల్లి శివప్రసాద్‌ మృతి పట్ల.. ఇప్పటికే రెండు రాష్ట్రాల రాజకీయ మరియు సినీ ప్రముఖులు శివప్రసాద్‌ కు ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా తాజగా డా. మోహన్ బాబు కూడా శివ ప్రసాద్ తో తనకున్న అనుభంధం గురించి ట్వీట్ చేశారు. మోహన్ బాబు మాటల్లో.. ‘డా. శివ ప్రసాద్ నాకు దాదాపు నలభై సంవత్సరాల నుంచి తెలుసు. 1985 – 90లలో నేను హీరోగా నటించిన ‘భలే రాముడు’ అనే సినిమాలో ఓ గెస్ట్ వేషంలో నటించాడు. అతను నాకు మంచి మిత్రుడు, నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త. ఇటీవలే నాతో ‘గాయత్రి’లో కూడా యాక్ట్ చేసాడు. ఎప్పుడు పలకరించినా అన్న అన్న అంటు ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. శివప్రసాద్ మరణం నన్ను కలిచివేసింది. అతనికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.

ఇక శివప్రసాద్‌ ప్రత్యేక హోదా ఉద్యమంలో తనదైన ప్రత్యేక శైలితో ప్రజలతో పాటు రాజకీయ నాయకులను ఆకట్టున్నారు. శివప్రసాద్ 2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు