ఓటీటీలోకి వచ్చేసిన ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఓటీటీలోకి వచ్చేసిన ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Published on Jun 18, 2026 7:59 AM IST

Drishyam-3

మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్‌పై సందడి చేస్తోంది. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం, నేటి(జూన్ 18) నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రేజీ అప్‌డేట్‌తో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

​డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మూడో భాగంలో కూడా జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడాడనేది ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రం ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా డబ్బింగ్ వెర్షన్లలో అందుబాటులోకి రావడం విశేషం.

​బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, థియేటర్ రన్ ముగిసిన వెంటనే ఓటీటీలోకి వచ్చేసింది. మీనా, అన్సిబా, ఈస్తర్ అనిల్, సిద్ధిఖ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్‌ను ఈ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకుని, అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు