పుష్పకి అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇచ్చిన దేవి !

Published on May 24, 2021 8:30 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ అద్భుతంగా వచ్చిందని దేవి మంచి ట్యూన్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ జానపద నేపథ్యంలో సాగుతుందని.. పక్కా మాస్ అంశాలు ఈ సాంగ్ లో ఉండబోతున్నాయని, ఈ స్టార్ కంపోజర్ ఇప్పటికే ఈ పాటను కూడా రికార్డ్ చేశారని తెలుస్తోంది. ఈ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకున్నారు.

కాగా ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా సుక్కు- దేవీ కాంబినేష‌న్‌లో ఐటం సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప సినిమా కోసం ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌ను ఏ రేంజ్‌లో ఊపేస్తుందో చూడాలి. ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :