ఫుల్ స్వింగ్ లో “డేగల బాబ్జీ” డబ్బింగ్…ఫోటో షేర్ చేసిన బండ్ల గణేష్!

Published on Oct 22, 2021 1:00 pm IST

నటుడుగా నిర్మాతగా ఉన్నటువంటి బండ్ల గణేష్ హీరోగా చేస్తున్న తొలి చిత్రం డేగల బాబ్జీ. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక అప్డేట్ ను బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ చిత్రం డబ్బింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది. పక్కా డిఫెరెంట్ ఫిల్మ్ అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

బండ్ల గణేష్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, సినిమా మంచి విజయం సాధించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమిళం లో ఒత్థా సెరుప్పూ సైజ్ 7 కి ఈ చిత్రం రీమేక్. ఈ చిత్రాన్ని యశ్ రిషి బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. వెంకట్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More