నా కెరీర్ పట్ల నాన్న ఆనందంగా ఉన్నాడు – దుల్కర్ సల్మాన్ !
Published on May 24, 2018 9:30 pm IST


దుల్కర్ సల్మాన్ ఇంతకు ముందు మలయాళ ,తమిళ ప్రేక్షకులకి మాత్రమే తెలిసిన ఈ పేరు తాజాగా మహానటి సినిమాతో తెలుగు రాష్ట్రాలలో కూడా మారుమోగుతుంది. మలయాళ స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈయన అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . కథా బలం కలిగిన సినిమాలని ఎంచుకుంటు ముందుకు వెళ్తున్నారు .ఇటీవల దుల్కర్ నటించిన సినిమా మహానటి. ఈ సినిమాలో అయన జెమినీ గణేశన్ పాత్రలో ఒదిగిన తీరు అద్భుతమనే చెప్పాలి . ఒక మలయాళీ వాడైనా సహజత్వం కోసం తెలుగులోనే డబ్బింగ్ చెప్పి ఆ పాత్రకి న్యాయం చేసారు . ముక్యంగాఈ సినిమాలో కీర్తి సురేష్ , దుల్కర్ ల కెమిస్ట్రీ తెర మీద చూడ చక్కగా ఉండి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ నేను సెలెక్ట్ చేసుకునే సినిమాల పట్ల మా నాన్న గారు చాలా సంతోషంగా వున్నారు .అయన నన్నుఇక ముందు ఇలాగే మంచి పాత్రల్లో నటిస్తావా అని అడిగినట్టుగా చెప్పుకొచ్చారు. ఇక దుల్కర్ ఈ ఏడాది బాలీవుడ్ లోకి అరంగేట్రం చేయనున్నారు . అయన హిందీ లో స్టార్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి నటించనున్నాడు.

 
Like us on Facebook