“దుల్కర్ సల్మాన్” కు సరిజోడి దొరికింది గా!

Published on Aug 1, 2021 4:19 pm IST


ఫీల్ గుడ్ మూవీస్ ను తెరకెక్కించే దర్శకుడు హను రాఘవపూడి మరొకసారి తన సరికొత్త కథనం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయిన సంగతి అందరికీ తెలిసిందే. దుల్కర్ సల్మాన్ తో త్రి భాష చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కి ఇంకా టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. ప్రొడక్షన్ 7 గా ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం లో దుల్కర్ సల్మాన్ కి సరి జోడీ గా మృణల్ ఠాకూర్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వెలువడింది.

అయితే ఈ చిత్రం లో మృణల్ ఠాకూర్ ఈ చిత్రం లో సీత పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను సైతం చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అయితే నేడు తన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సీత కి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :