నాని సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్న లక్కీ భాస్కర్!

నాని సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్న లక్కీ భాస్కర్!

Published on Apr 17, 2025 3:00 AM IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ వేసవి కానుకగా మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇక హిట్ ఫ్రాంచైజీలో ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించిన మలయాళ రైట్స్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫారర్ ఫిలింస్ బ్యానర్ దక్కించుకుంది. దీంతో ఈ సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్ గ్రాండ్ రిలీజ్ చేయనున్నాడు. ఇక హిట్ వర్స్ చిత్రాలకు అక్కడ కూడా క్రేజ్ ఉండటంతో ఈ చిత్ర రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు అక్కడి ప్రేక్షకులు థ్రిల్ కావడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమా దుల్కర్ సల్మాన్‌కు ఎంతమేర లక్ తీసుకొస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు