సంక్రాంతి బరిలో దుల్కర్ సల్మాన్

Published on Jan 3, 2022 10:02 pm IST

భారీ పాన్ ఇండియా చిత్రం రౌద్రం రణం రుధిరం చిత్రం వాయిదా పడటం తో చిన్న చిన్న సినిమాలు తమ విడుదల తేదీలను ప్రకటించడం జరిగింది. తెలుగు లో మాత్రమే కాకుండా మిగతా బాషల్లో పలు చిత్రాలు విడుదల అవుతున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ మూవీ వాయిదా తో మరిన్ని సినిమాలు విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి. అందులో తాజాగా మలయాళ స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ చిత్రం కూడా ఉండటం విశేషం. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సెల్యూట్ చిత్రం ను ఈ నెల 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తెలుగు లో సైతం ఈ చిత్రం విడుదల కానుంది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో దుల్కర్ సల్మాన్ పోలీస్ అధికారి గా కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :