త్వరలో టీవీ ప్రీమియర్ గా “ఈగల్”

త్వరలో టీవీ ప్రీమియర్ గా “ఈగల్”

Published on Apr 10, 2024 3:19 PM IST

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈగల్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఓటిటి లోకి కూడా అరంగేట్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అమేజాన్ ప్రైమ్ వీడియో మరియు ఈటీవీ విన్ లో ఈ చిత్రం డిజిటల్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ చానెల్ సొంతం చేసుకుంది. త్వరలో టీవీ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభోట్ల సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రానికి దావ్ జంద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు