విడుదలకు సిద్దమవుతున్న ఇద్దరి లోకం ఒకటే

విడుదలకు సిద్దమవుతున్న ఇద్దరి లోకం ఒకటే

Published on Nov 29, 2019 4:11 PM IST

IddariLokamOkate

యంగ్ హీరో రాజ్ తరుణ్ విజయాల పరంగా కొంచెం వెనుకబడ్డాడు. గత ఏడాది జులై లో లవర్ అంటూ పలకరించాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. ఆ చిత్రం విడుదలైన ఏడాదిన్నర తరువాత రాజ్ తరుణ్ మరో ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ తో రానున్నాడు. ఇద్దరి లోకం ఒకటే అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే నటించడం విశేషం. షాలిని పాండే, రాజ్ తరుణ్ మొదటి సారి జంటగా నటిస్తున్నారు. కాగా ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. వచ్చే నెలలో ఈ మూవీ విడుదల చేయనున్నారు.

హిట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా చెప్పుకొనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. దీనితో ఈ సారి రాజ్ తరుణ్ ఖచ్చితంగా హిట్ కొడతానని నమ్మకంగా ఉన్నారు. ఈ మూవీ విజయం రాజ్ తరుణ్ కెరీర్ కి కూడా చాలా అవసరం. జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెలలో ఈ మూవీ విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు