ఓవర్సీస్లో ‘ఈ నగరానికి ఏమైంది ?’ వసూళ్ల వివరాలు !
Published on Jun 30, 2018 1:44 pm IST

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది ?’ చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. తరుణ్ భాస్కర్ గత చిత్రం ‘పెళ్లి చూపులు’ ఓవర్సీస్లో సంచలన విజయాన్ని దక్కించుకుని ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు కొంత ఎక్కువ ఆసక్తి కనబర్చారు.

అందుకే ప్రీమియర్ల ద్వారా 98,488 డాలర్లను రాబట్టిన ఈ సినిమా శుక్రవారం రోజున 73,000 డాలర్లను అందుకుంది. శని, ఆదివారాల్లో ఈ వసూలు ఇలాగే కొనసాగే అవకాశముంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరిలు ప్రధాన పాత్రలు పోషించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook