దర్శకుడిగా మారిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్ర నటుడు !

దర్శకుడిగా మారిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్ర నటుడు !

Published on Jun 22, 2018 5:00 PM IST

vishwak

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఈ నెల 29న విడుదలకానుంది. ఈ చిత్రంలో సుశాంత్ రెడ్డి, విశ్వక్ సేన్ నాయుడు, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమటంలు ప్రధాన పాత్రలు పోషించారు. వీరిలో విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడ తన ప్రతిభ చూపనున్నాడు.

ఈయన త్వరలో మలయాళ క్రైమ్ డ్రామా ‘అంగమలై డైరీస్’ ను తెలుగులోకి రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తూనే అందులో నటిస్తున్నాడు. అంతేగాక ఈ చిత్రాన్ని అతనే వనమాయె క్రియేషన్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మిస్తున్నారు. హైదారాబాద్ ఓల్డ్ సిటీలోని ఫలక్ నుమా, లాల్ దర్వాజా వంటి ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

తాజా వార్తలు