‘వివిఆర్’ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ నటి !

Published on Dec 13, 2018 8:41 am IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ లో స్పెషల్ సాంగ్ లో నర్తించనుంది బాలీవుడ్ నటి ఇషా గుప్తా. ఈసాంగ్ చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేకమైన పబ్ సెట్ ను నిర్మిస్తున్నారు. రేపటి నుండి ఈ సాంగ్ ను షూట్ చేయనున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ చిత్రీకరణలో చరణ్ ,ఇషా తో కలిసి స్టెప్పులు వేయనున్నారు. ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడని సమాచారం.

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనెర్ లో కియారా అద్వానీ కథానాయిక నటిస్తుండగా ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ , స్నేహ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దానయ్య డివివి నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :