సుశాంత్ సరసన తెలుగు హీరోయిన్ ?

Published on Nov 29, 2019 3:00 am IST

తెలుగు బ్యూటీ ఇషా రెబ్బా తాజాగా ‘రాగల 24 గంటల్లో’తో హిట్ అందుకుంది. ఇక మొదటి నుంచీ ఇషాకు అవకాశాలొచ్చినా ఆశించిన విజయాలు అయితే దక్కలేదు. దాంతో చివరికీ అమ్మడు హాట్ స్టిల్స్ బాగా వదులుతుంది. ఈ మధ్య ఈషా రెబ్బ హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. అయితే ఈ తెలుగు బ్యూటీ తన లేటెస్ట్ సినిమా అప్ డేట్ తో కూడా వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ హర్రర్ థ్రిల్లర్ లో ఈషా నటించనుంది. ఈ సినిమాలో సుశాంత్ హీరోగా నటించనున్నట్లు.. ఈ సినిమాకి వెంకట్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇక ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన, ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఆ తర్వాత ‘అమీతుమీ’, ‘అ’, అరవింద సమేత లాంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో ఓ హర్రర్ థ్రిల్లర్ తో రాబోతుంది. త్వరలోనే ఈ చిత్రం షూట్ కి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :