అక్కడ రిలీజ్‌కు సిద్ధమైన ‘ఈషా’.. బుకింగ్స్ షురూ..!

అక్కడ రిలీజ్‌కు సిద్ధమైన ‘ఈషా’.. బుకింగ్స్ షురూ..!

Published on Dec 29, 2025 8:12 PM IST

eesha 4

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన హారర్ జోనర్ చిత్రం ‘ఈషా’ ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేయడంతో ఈ మూవీకి మంచి బూస్ట్ లభించింది. ఇక ప్రమోషన్స్‌తోనూ ఈ సినిమాను ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యేలా చేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకులను సైతం భయపెట్టేందుకు రెడీ అవుతోంది. న్యూ ఇయర్ కానుకగా 2026 జనవరి 1న ‘ఈషా’ చిత్రాన్ని ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎపిక్ క్లాప్ సినిమా సంస్థ ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ తెరుచుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీనివాస్ మన్నె డైరెక్ట్ చేయగా కెఎల్.దామోదర్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు