‘ఆర్ ఆర్ ఆర్’ పై పుకార్లకు అంతం ఎప్పడు?

Published on Jun 7, 2019 3:30 pm IST

రాజమౌళి మూవీ అంటే చాలు అనేక పుకార్లు షికారు చేస్తూ ఉంటాయి.సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలో ఈ దర్శకధీరుడికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఐతే రాజమౌళి ‘బాహుబలి’ తరువాత తారక్,చరణ్ లతో ‘ఆర్ ఆర్ ఆర్’ అనే మల్టీస్టారర్ ప్రకటించినప్పటినుండి కథ విషయం లో పాత్రల విషయంలో పుకార్లు వస్తుండగా, కథేమిటో రాజమౌళి పత్రికాముఖంగా చెప్పి ప్రేక్షకుల ఆత్రానికి అడ్డుకట్ట వేశారు. కానీ పాత్రల విషయంలో మాత్రం ఈ పుకార్లు రావడం ఇంకా ఆగడం లేదు.

కొద్దినెలల క్రితం ఈ మూవీలో ఓ హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుందని రూమర్స్ రావడంలో కీర్తి నే స్వయంగా అలాంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత ప్రభాస్ అతిధి పాత్రంటూ, అనుష్క పవర్ఫుల్ రోల్ అని మరికొన్నివార్తలు కొన్ని రోజులు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. రెండు రోజుల క్రితం సాయి పల్లవిని ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుందని పుకార్లు పుట్టించిన మాధ్యమాలు, నేడు మరొక ఆసక్తికరమైన వార్తతో రెడీ ఐపోయారు.

అదేంటంటే లేడీ అమితాబ్ విజయశాంతి ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఓ కీలకపాత్ర చేస్తున్నారట. కథ పరంగా ఓ ముఖ్య పాత్రకి విజయశాంతి ఐతే బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నారట. ఆమెతో చర్చలు జరిపి ఎలాగైనా ఒప్పించాలని నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఇందులో నిజం ఏంటో తెలియదు కానీ కొన్ని మాధ్యమాలు విస్తృతంగా ప్రచారం చేసేస్తున్నాయి. “ఆర్ ఆర్ ఆర్” పై వస్తున్న ఇలాంటి నిరాధారమైన పుకార్లు జనాల్ని విసిగించేస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More