‘సాక్ష్యం’ చూపించనున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ !

Published on Jul 21, 2018 6:31 pm IST

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రం ‘సాక్ష్యం’. విఎఫ్ఎక్స్ తో కూడిన సన్నివేశాలతో ప్రకృతి నేపధ్య కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్.

సీనియర్ నటీనటులు జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం జులై 27 న ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియో , ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించింది.

సంబంధిత సమాచారం :