రుద్ర వెబ్ సిరీస్ తో ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి అడుగు పెడుతున్న ఇషా డియోల్!

Published on Jul 7, 2021 7:19 pm IST

అజయ్ దేవగణ్ లీడ్ రోల్ లో రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ అంటూ ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలవగా, ఇప్పుడు ఈ సీరీస్ లోకి ఇషా డియోల్ అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ దీని పై అధికారిక ప్రకటన సైతం వెలువడింది. ఈ సిరీస్ బ్రిటిష్ సిరీస్ అయిన లూతర్ కి రీ ఇమాజినేషన్ అని తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

అయితే అజయ్ దేవగణ్ తొలిసారి గా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుండగా ఇందులో ఇషా డియోల్ రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో ఓటిటి ద్వారా ఎంతోమంది స్టార్ హీరో, హీరయిన్లు ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇంటెన్స్ క్రైమ్ డ్రామా లో కొత్తగా నటీనటులు చేరడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :