‘అరవింద సమేత’లో ఈషా రెబ్బా పాత్ర అదేనా ?

Published on Jul 11, 2018 9:40 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న’అరవింద సమేత’ చిత్రంలో’అంతకుముందు ఆతరువాత’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనయువ నటి ఈషా రెబ్బా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుందని తెలిసిందే. ఇప్పుడు ఆమె పాత్ర గురించి ఆసక్తికర విషయం తెలిసింది. ఈచిత్రంలో ఆమె ఎన్టీఆర్ మాజీ ప్రేయసిరాలుగా నటిస్తున్నారట.

పూజా హెగ్డే ప్రధాన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో జగపతి బాబు , నాగబాబులు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకులుగా కనిపించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకులముందుకు రానుందని సమాచారం.

సంబంధిత సమాచారం :