వరద బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించిన రామోజీ రావు గారు.!

Published on Oct 22, 2020 3:08 pm IST

ఇటీవలే వచ్చిన కరోనా చాలదు అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల కితం వచ్చిన కుంభవృష్టి మరింత నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ లో వానలైతే మొత్తం నగరాన్ని ముంచేసాయి.

దీనితో ఎంతమంది సినీ ప్రముఖులు వరద నగర అభివృద్ధికి మరియు వరద బాధితులకు భారీ విరాళాలను ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ నిధికి అందించారు. అయితే ఇప్పుడు వారందరినీ మించే విధంగా “ఈనాడు” అధినేత రామోజీ రావు గారు తన ఉదారతను మరియు భాద్యతను చాటుకున్నారు.

ఆయన ఏకంగా అక్షరాలా 5 కోట్ల రూపాయల విరాళాన్ని హైదరాబాద్ వరద బాధితులను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ నిధికి ప్రకటించారు. ఆయన ప్రసార మాధ్యమాలతో ఎంతో సేవను అందిస్తున్న ఆయన నుంచి ఇలాంటి భారీ మొత్తపు విరాళం ప్రకటన రావడం నిస్సహాయులకు మరింత అండను ఇచ్చే అంశం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More