గత వారం మంచి టీఆర్పీ రాబట్టిన “ఢీ 13” ఎపిసోడ్.!

Published on Aug 5, 2021 6:01 pm IST


మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ప్రతీ ఎంటర్టైనింగ్ షో కి కూడా మంచి ఆదరణ తెలుగు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ ఉంటుంది అని తెలిసిందే. మరి వాటిలో సౌత్ ఇండియన్ స్మాల్ స్క్రీన్ దగ్గర బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో అయినటువంటి “ఢీ” షో సక్సెస్ ఫుల్ గా 12 సీజన్లను కంప్లీట్ చేసుకుని 13వ సీజన్ “కింగ్స్ వర్సెస్ క్వీన్స్” కూడా అంతే సూపర్ గా రన్ అవుతుంది.

ఎప్పటికప్పుడు అదిరే కాన్సెప్ట్ అండ్ సాలిడ్ డాన్స్ పెర్ఫామెన్స్ లతో వాటికి తోడు మంచి ఎంటర్టైన్మెంట్ ని కూడా కలిపి అందిస్తుంది. మరి ఈ షో గత వారం ఎపిసోడ్ కి గాను చాలా మంచి టీఆర్పీ రేటింగ్ ని రాబట్టినట్టు తెలుస్తుంది. కరెక్ట్ నెంబర్ ఏమో కానీ ఢీ ముందు ఎపిసోడ్స్ రేటింగ్ రాబట్టినట్టు తెలుస్తుంది.

మరి ఈ షో కి ప్రదీప్ వ్యాఖ్యాతగా చేస్తుండగా సుధీర్, ఆది మరియు రష్మీ, దీపికాలు వారి టీం లను లీడ్ చేస్తున్నారు. అలాగే ఈ షోలో న్యాయ నిర్ణేతలుగా గణేష్ మాస్టర్, పూర్ణ మరియు ప్రియమణిలు చేస్తున్నారు. మరి ఈ గ్రాండ్ షో ప్రతీ బుధవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుంది అన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :