తల్లి కాబోతున్న హీరోయిన్.. అదే పెద్ద గిఫ్ట్ అట !

Published on Jul 11, 2021 7:49 pm IST

బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ ఎవెలిన్‌ శర్మ తన ఫ్యాన్స్ కు షాకింగ్ సర్ ప్రైజ్ ను ఇచ్చింది. తానూ త్వరలోనే తల్లి కాబోతున్నాను అంటూ ఈ క్రేజీ విషయాన్ని తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. ఈ సందర్భంగా తన బేబీ బంప్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. నా బంగారు చిన్నారిని నా చేతుల్లోకి తీసుకుని ఆడించేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను’ అంటూ ఎవెలిన్‌ శర్మ మెసేజ్ చేసింది.

అన్నట్టు రేపు ఎవెలిన్‌ శర్మ బర్త్‌ డే కూడా. ఈసారి ఇదే తనకు ఆ దేవుడు ఇచ్చిన అతి పెద్ద బర్త్‌డే గిఫ్ట్‌ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తన బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాక, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ను, ఆలాగే తన సినీ సన్నిహితులను కలుస్తానని ఎవెలిన్‌ శర్మ చెప్పుకొచ్చింది. ఇక సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు.

కాగా ఎవెలిన్‌ ఆస్ట్రేలియాకు చెందిన డెంటిస్ట్ తుషన్‌ బిండీతో 2019లో నిశ్చితార్థం జరుపుకుని.. ఈ ఏడాది మే 15లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ లో అతన్ని పెళ్లి చేసుకుంది.

సంబంధిత సమాచారం :