మాస్ మహారాజ్ నెక్స్ట్ ప్రతిదీ అదిరిపొద్దట.!

Published on Jun 11, 2021 8:01 am IST

ఈ ఏడాది టాలీవుడ్ కే తన క్రాకింగ్ హిట్ తో సాలిడ్ ఎంట్రీ ఇచ్చారు మాస్ మహారాజ్ రవితేజ. తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో తెరకెక్కించిన అవుట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ డ్రామా “క్రాక్” హిట్ తర్వాత శరవేగంగా “ఖిలాడి” స్టార్ట్ చేసేసి దానిని ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొచ్చేసారు. ఇక దీనితో పాటుగా మరిన్ని ప్రాజెక్ట్ లు రవితేజ లైనప్ లో ఉన్నాయి. అయితే వాటిలో ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకునికి మొదటి ఇవ్వనున్నారు.

తమిళ్ మరియు తెలుగులో పలు సాలిడ్ చిత్రాలకు అసిస్టెంట్ దర్శకునిగా పని చేసిన శరత్ మందవ రవితేజతో సినిమా చేయనున్నాడు. అయితే ఈ చిత్రంలో ప్రతి అంశం అదిరిపోతుంది అని అంటున్నాడు. టైటిల్, థీమ్ సాంగ్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతిదీ కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని అంటున్నాడు. అలాగే ఈ చిత్రం జూలై నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ కాంబోలో సినిమా ఎలా ఉండనుందో వేచి చూడాలి..

సంబంధిత సమాచారం :