రాశిని అందరూ అలా పిలుస్తున్నారట..!

రాశిని అందరూ అలా పిలుస్తున్నారట..!

Published on Dec 23, 2019 12:00 AM IST

ప్రతిరోజు పండుగే మూవీకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ నేడు సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. హీరో ధరమ్ తేజ్, హీరోయిన్ రాశి ఖన్నాలతో పాటు దర్శకుడు మారుతీ మరియు నిర్మాత బన్నీ వాసు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన రాశి ఖన్నా ప్రతిరోజూ పండుగే లాంటి ఒక మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నటుడు రావు రమేష్ హీరో ధరమ్ పై ఆమె ప్రసంశలు కురిపించారు.

ప్రతిరోజూ పండుగే చిత్రంలో తాను చేసిన ఏంజెల్ ఆర్నా పాత్రకు చాలా పేరు వచ్చిందన్న రాశి.. తనను అందరూ ఏంజెల్ ఆర్నా అని పిలుస్తున్నారని చెప్పుకొచ్చింది. పల్లెటూరికి చెందిన అమ్మాయిగా రాశి ఖన్నా ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్టార్ డైరెక్టర్ సుకుమార్, పరుశురాం సీనియర్ రైటర్ పరుచూరి గోపాల కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు