రాజ్ తరుణ్ లవర్ అందరికి నచ్చేలా ఉంటుంది !

రాజ్ తరుణ్ లవర్ అందరికి నచ్చేలా ఉంటుంది !

Published on Jul 18, 2018 11:53 AM IST

రాజ్ తరుణ్ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. కాగా రాజ్ తరుణ్ కెరీర్ ఇప్పుడు సజావుగా సాగాలంటే అతనికి తప్పనిసరి ఓ మంచి హిట్ పడాలి. ఐతే తను తాజాగా నటించిన ‘లవర్’ చిత్రం మీదే రాజ్ తరుణ్ ఆశలు పెట్టుకున్నాడు. లవర్ చిత్రాన్ని ‘అలా ఎలా’ చిత్రంతో పరిచయమైన దర్శకుడు అన్నీష్ కృష్ణ దర్శకత్వం వహించారు.

అయితే ఈ ‘లవర్’ చిత్రం చాలా బాగా వచ్చిందని, మంచి ఎంటర్టైనింగా అందరికి నచ్చేలా ఉంటుందని సినీవర్గాల నుండి సమాచారం అందుతుంది. జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకోవడంతో పాటు, చిత్రంలోని కొన్ని సన్నివేశాలు బాగా నవ్విస్తాయట. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో విడుదలైన పాటలు కూడా బాగా ప్రేక్షకాధరణ పొందుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు