గత శుక్రవారం బాక్సాఫీస్ వద్ద చాలా తెలుగు సినిమాలు పోటీ పడ్డాయి. కానీ, చాలా వరకు ఏ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నిజానికి థియేటర్లలో మంచి స్పేస్ తో విడుదలైనప్పటికీ, ఏ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద నారి, జిగేల్, రా రాజు, శివంగి, 14 డేస్… గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ వంటి తెలుగు సినిమాలు మెప్పించలేకపోయినా, హిందీ బ్లాక్ బస్టర్ చావా తెలుగులో దూసుకువెళ్తుంది.
హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘చావా’, తెలుగులో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మొత్తానికి ఈ వారం చావా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. నిజానికి జివి ప్రకాష్ కుమార్ 25వ చిత్రం ‘కింగ్‌స్టన్’ కూడా గత వారం రిలీజ్ అయింది. కానీ, ఆ సినిమా కూడా ఎటువంటి సంచలనాన్ని సృష్టించలేకపోయింది. ఆ రకంగా చావాకి ఈ వారం కలిసి వచ్చింది. ఇక హోలీ దగ్గర పడుతుండటంతో, ఈ వారం కోర్ట్, దిల్ రూబా, తెలుగు డబ్బింగ్ సినిమా ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ వంటి కొత్త సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.


