“బాహుబలి” నిర్మాణ సంస్థ నుంచి ఎగ్జైటింగ్ న్యూస్.!

“బాహుబలి” నిర్మాణ సంస్థ నుంచి ఎగ్జైటింగ్ న్యూస్.!

Published on Mar 19, 2024 11:38 AM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు భారీ నిర్మాణ సంస్థల్లో టాలీవుడ్ ప్రైడ్ చిత్రం “బాహుబలి” (Bahubali) లాంటి సినిమాలను అందించిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ కోసం తెలిసిందే. అయితే తాము అక్కడ నుంచి చిత్రాలనే తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత శోబు యార్లగడ్డ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. తమ ఆర్కా మీడియా వర్క్స్ నుంచి అయితే ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ రాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు.

అలాగే ఇది రేపు రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు. దీనితో ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అయితే ఇది ఏదో భారీ సినిమా కోసమే కావచ్చని కొందరు అనుకుంటున్నారు. కానీ వీరి బ్యానర్ నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ తో కూడా ఓ ప్రాజెక్ట్ ఉందని బజ్ ఉంది. మరి దానిపై ఏమన్నా వస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి ఈ భారీ నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసే కొత్త ప్రాజెక్ట్ ఏ పాన్ ఇండియా స్టార్ తోనైనా ఉంటుందా అని ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు