లేటెస్ట్..చరణ్, శంకర్ బిగ్ ప్రాజెక్ట్ పై ఎగ్జైటింగ్ వార్త.!

Published on Jul 2, 2021 4:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక బెంచ్ మార్క్ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబో 15వ సినిమా ఇది కాగా నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుంచి 50 వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. అందుకే ఈ భారీ ప్రాజెక్ట్ పై ఎనలేని అంచనాలు ఉన్నాయి. అయితే అసలు ఈ సినిమా మొదలు కావడానికి శంకర్ కి కొన్ని అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే.

తాను అంతకు ముందు చేసిన “ఇండియన్ 2” నిర్మాతలు ఓ కేస్ వెయ్యగా అదే ఇప్పటి వరకు నడుస్తుంది. దీనితో చరణ్ తో ప్లాన్ చేసిన సినిమా అలా వెనక్కి వెళ్తూ వస్తుంది. ఈ కారణం చేత చరణ్ అభిమానుల్లో కూడా కొద్ది పాటి నిరాశ నెలకొంది. మరి ఎట్టకేలకు వారికి గుడ్ న్యూస్ వినిపిస్తుంది.

తమిళనాడు హై కోర్టు లైకా వారుతమ ఇండియన్ 2 సినిమా పూర్తయ్యే వరకు చరణ్, శంకర్ ల సినిమా మొదలు కాకూడదని శంకర్ పై వేసిన పిటీషన్స్ అన్నీ కొట్టివేసిందట. సో ఈ సంచలన కాంబోకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యిపోయినట్టే అని చెప్పాలి. ఇప్పుడు ఎలాగో “RRR” కంప్లీట్ అయ్యిపోతుంన్నందున సరికొత్త మేకోవర్ లోకి చరణ్ మారి ఆ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడమే ఆలస్యం.

సంబంధిత సమాచారం :