ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ : చంద్రశేఖర్ ఏలేటి – మోహన్ లాల్ తప్ప ‘మనమంతా’ చిత్రాన్ని మరెవరూ చేయలేరు !

ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ : చంద్రశేఖర్ ఏలేటి – మోహన్ లాల్ తప్ప ‘మనమంతా’ చిత్రాన్ని మరెవరూ చేయలేరు !

Published on Aug 4, 2016 1:47 PM IST

chandrasekhar-yeleti
తెలుగు పరిశ్రమలో ఉన్న దర్శకుల్లో ‘చంద్రశేఖర్ ఏలేటి’ గారికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమా విడుదలప్పుడు తప్ప ఆయన పేరు పెద్దగా ఎక్కడా వినిపించదు. ఎందుకంటే ఆయన సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు కూడా ఎప్పుడూ సైలెంట్ గానే ఉంటారు కనుక. ఈయన ప్రతి సినిమాలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం ఈయన మళయాళ సూపర్ స్టార్ ‘మోహన్ లాల్’ గారితో తెరకెక్కించిన ‘మనమంతా’ చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం…

ప్ర) మీరు ‘మోహన్ లాల్’ పాత్రలో వేరే తెలుగు హీరో ఎవర్నైనా తీసుకోనుండొచ్చు కదా ?
జ) ఈ సినిమాలో మోహన్ లాల్ చేసిన పాత్ర చాలా బలమైంది, రియలిస్టిక్ గా కూడా ఉంటుంది. వేరే తెలుగు స్టార్ హీరోలెవరైనా ఈ పాత్ర చేస్తే వాళ్లకున్న స్టార్ డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దాన్ని చెడగొడుతుంది. అందుకే ఆయన చేత చేయించాను.

ప్ర) అసలు మోహన్ లాల్ గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
జ) స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసిన తరువాత లీడ్ కాస్టింగ్ గురించి ఆలోచించి మోహన్ లాల్ గారైతే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఆయన గతంలో ఇలాంటి రియలిస్టిక్ పాత్రలు చేశారు.

ప్ర) సినిమాని తమిళం, మలయాళంలో కూడా చేయడానికి మోహన్ లాల్ గారే కారణమా ?
జ) అవును. ఇది ఆయన ఆలోచనే. అయన చెప్పగానే అన్నీ పనులు అవే జరిగిపోయాయి.

ప) మూడు భాషల్లో సినిమా తీసేటప్పుడు ఏమైనా కష్టం అనిపించిందా ?
జ) ఎప్పుడైనా కష్టం ఒకటే. కాకపొతే సినిమాని మూడు భాషల్లో చేసేటప్పుడు బడ్జెట్ కాస్త పెంచుతారు. ఆ బడ్జెట్ తో సినిమాని ఇంకా బాగా తీయొచ్చు.

ప్ర) సినిమా గురించి ఏమైనా చెబుతారా ?
జ) సాహసం తరువాత భావోద్వేగాలు, రోజువారీ కష్టాలు ఉండే ఏదైనా ఫ్యామిలీ డ్రామా చేద్దామనుకున్నా. నలుగురు వేరు వేరు వ్యక్తులకు సంబందించిన ఎమోషనల్ జర్నీ ఎలా ఒక పాయింట్ వద్ద కలుస్తాయి అనేదే ఈ సినిమా.

ప్ర) సాహసం తరువాత ఈ సినిమా తేలిగ్గా అనిపించిందా ?
జ) లేదు. నేను చేసిన సినిమాలో ఇదే కష్టమైన సినిమా. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే భావోద్వేగాలను రాబట్టడం కోసం చాలా కష్టపడ్డాను.

ప్ర) చాలా మంది మీ సినిమా ‘దృశ్యం’ లానే ఉందంటున్నారు. మీరేమంటారు ?
జ) ట్రైలర్ లోని సీరియస్ పార్ట్ చూసి చాలా మంది అలానే అనుకంటున్నారు. కానీ ఇది దృశ్యం ల మొత్తం థ్రిల్లర్ కాదు. చివరి 15 నిముషాలు మాత్రమే స్పీడ్ గా ఉంటుంది.

ప్ర) మోహన్ లాల్, గౌతమీ లతో పని చేయడం ఎలా ఉంది ?
జ) మొదట కాస్త కంగారుగానే అనిపించింది. కానీ తరువాత వాళ్ళతో పనిచేయడం చాలా సులువైపోయింది. స్టార్లతో పని చేస్తే ఇదే చాలా ఈజీగ కాన్ఫిడెంట్ గా ఉంది.

ప్ర) మీ సినిమాలన్నీ మంచి ప్రశంసలు అందుకుంటున్నాయి ? మరి కమర్షియల్ గా హిట్ అవడం లేదు. బాధగా లేదా ?
జ) లేదు. నా సినిమాలు రియలిస్టిక్ గా ఉండి సొసైటీకి దగ్గరగా ఉంటాయి. అందులోని పాత్రలు సామాన్యుడికి చాలా దగ్గరగా ఉంటాయి. నా సినిమాలు బాధ్యతాయుతంగా ఉంటాయని అనుకుంటాను. అందుకే ఇంకా సినిమాలు తీస్తున్నాను.

ప్ర) మొహాన్ లాల్ గారు డబ్బింగ్ చెప్పారు కదా దాని గురించి ?
జ) సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పడమనేది మోహన్ లాల్ గారి ఆలోచనే. ఆయన డబ్బింగ్ బాగా చెప్పారని నేననుకుంటున్నాను. సినిమాలో ఉన్న ఎమోషన్ అన్ని నెగెటివ్ అభిప్రాయాల్ని దూరం చేస్తుంది.

ప్ర) చివరగా మనమంతా గురించి ప్రేక్షకులకు ఏమైనా చెబుతారా ?
జ) మనమంతా మనసుల్ని తాకే సినిమా. చివరి క్లైమాక్స్ లో వచ్చే 15 నిముషాల సినిమా, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ మిమ్మల్ని ఖచ్చితంగా థ్రిల్ చేస్తాయి.

ఇంటర్వ్యూ ఇంతటితో ముగిసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు