ప్రత్యేక ఇంటర్వ్యూ : మహి వి రాఘవ్ – మూవీ బాగుంటే ఏదైనా పెద్ద సినిమానే అవుతుంది.

mahi
‘వినాయకుడు’ సినిమా ద్వారా రైటర్ గా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాల ద్వారా నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న మహి వి రాఘవ్ అక్టోబర్ 10న విడుదల కానున్న ‘పాఠశాల’ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 5 మంది ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే ఈ రోడ్ జర్నీ సినిమా గురించి పలు విశేషాలను డైరెక్టర్ మహి మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం.

ప్రశ్న) అసలు ఈ ‘పాఠశాల’ మూవీ కథకి స్ఫూర్తి ఏమిటి.? అసలు ఈ కథ ఎలా మొదలైంది.?

స) ఈ సినిమా పోస్టర్స్ మరియు ట్రైలర్స్ చూసినప్పుడు పలు సినిమాలకి స్ఫూర్తి అనిపించవచ్చు. మీరు పలు భాషల్లో ఇలాంటి జోనర్ సినిమాలు చూసి ఉండవచ్చు కానీ ఈ సినిమా స్టొరీ లైన్ చాలా కొత్తగా ఉంటుంది. నేను సినిమా చెయ్యాలి అనుకున్నప్పుడు, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం పెద్ద హీరో వెనుక పరిగెత్తలేను, అలాగే భారీ బడ్జెట్ పెట్టలేను. సో నా బడ్జెట్ ఎంత ఆ బడ్జెట్ లో మంచి సినిమా ఏమి తీయగలనా అని అనుకుంటున్నా టైం ఇప్పటి వరకూ కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చాలా వచ్చాయి. వాటికి కొనసాగింపు ఎక్కడా రాలేదు. ఆ పాయింట్ తీసుకొని అలాగే టాలీవుడ్ కి కొత్తైన ఫుల్ లెంగ్త్ రోడ్ జర్నీ జోనర్ ని తీసుకొని ఈ కథ రాసుకున్నాను.

ప్రశ్న) ‘పాఠశాల’ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి.?

స) ఇది వరకూ చెప్పినట్టు ఈ సినిమాకి కథ చాలా కొత్తగా ఉంటుంది. కథలో కొట్టే ఏమిటి అంటే ఇప్పటి వరకూ ఫ్రెండ్ షిప్ అంటే కాలేజ్ లోనే చూపించారు. ఆతర్వాత జర్నీని చూపించలేదు. కానీ మనతో ఉండే ఫ్రెండ్ తో పాటు తన ఊరెళ్తే అక్కడ ఇన్ని రోజులు మనతో ఉన్న ఫ్రెండ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. అదే ఈ సినిమాలో చూపించాం. అలాగే టాలీవుడ్ లో రాని ఫుల్ లెంగ్త్ రోడ్ జర్నీ మూవీ ఇది. అలాగే సినిమా చూస్తున్నంత సేపూ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

ప్రశ్న) మీరొక రైటర్ నుంచి నిర్మాతగా మారారు, ఇప్పుడేమో డైరెక్టర్. అసలు డైరెక్టర్ గా టర్న్ తీసుకోవడానికి గల రీజన్ ఏమిటి.?

స) నేను బేసికల్ గా ఒక రైటర్ ని, నా కథని చెప్పడానికి సినిమా అనే మాధ్యమాన్ని ఎంచుకున్నాను. నిర్మాత అనేది అనుకోకుండా జరిగింది. నేను ఈ కథ రాసుకున్నప్పుడు ఈ కథ ఎవరో డైరెక్ట్ చేస్తే ఈ సీన్ తను బాగా తీయలేదు, నేనైతే ఇలా తీసేవాన్ని అనే ఫీలింగ్ ఉండకూడదని నేనే నా కథకి డైరెక్టర్ గా పనిచేసాను.

ప్రశ్న) నందు, అను ప్రియ తప్ప మిగతా అందరూ కొత్త నటులే.. వాళ్ళు మీరు రాసుకున్న పాత్రలకు న్యాయం చేసారా.?

స) మేము సెలక్ట్ చేసుకున్నప్పటికీ నందు, అనుప్రియ కూడా కొత్తవారే.. కానీ ఈ సినిమా వచ్చే లోపు వాళ్ళ వేరే సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను ముందు నుంచీ ఈ సినిమా ద్వారా కొత్త వారిని పరిచయం చేసి, వారితో నా పాత్రలని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యాలనుకున్నాను. అలానే అందరినీ సెలక్ట్ చేసుకున్నాను. అందరూ వారి వారి రోల్స్ కి న్యాయం చేసారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మూవీలోని 5 పాత్రలలో ఏదో ఒక పాత్రకి కనెక్ట్ అవుతారు.

ప్రశ్న) మీరు స్వతహాగా రైటర్, ఇప్పుడు డైరెక్టర్.. ఈ రెండింటిలో మీకు బాగా టఫ్ గా అనిపించినది ఏది.?

స) నేను స్వతగాహా రైటర్ ని కాబట్టి రైటింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇక సినిమా పరంగా వస్తే రైటింగ్ ఎక్కువ టఫ్ అని చెబుతాను. ఎందుకంటే ఒక సినిమాకి పర్ఫెక్ట్ గా రైటింగ్ రాస్తే ఆ సినిమా 50% సక్సెస్ అయిపోయినట్లే. స్క్రిప్ట్ బాగుంటేనే సినిమా బాగా వస్తుంది. స్క్రిప్ట్ సరిగా లేకపోతే రజినీకాంత్ గారు నటించినా ఆడకపోవచ్చు. నా పరంగా రైటింగ్ టఫ్, ఆ తర్వాత్ డైరెక్షన్ అని చెబుతాను.

ప్రశ్న) ఈ సినిమా టైలర్స్ చూసిన వారు ‘జిందగీ నా మిలేగా దోబారా’ లాంటి సినిమాలతో పోలుస్తున్నారు.? అది సినిమాకి ఏమన్నా మైనస్ అవుతుందా.?

స) నేను విన్నాను.. చాలా మంది జిందగీ నా మిలేగా దోబరా లేదా రంగ్ దే బసంతి లాంటి సినిమాలతో పోల్చారు. కానీ నేను దాన్ని కాంప్లిమెంట్ గా తీసుకున్నాను. జోనర్ పరంగా లేదా రోడ్ మూవీస్ పరంగా సిమిలారిటీ ఉండవచ్చు కానీ కాన్సెప్ట్ పరంగా ఆ సినిమాలకి దీనికి అస్సలు పొంతన ఉండదు.

ప్రశ్న) ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి వల్ల సినిమాకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారా.?

స) అలా ఏమీ అనుకోవడం లేదు. ప్రతి సినిమాకి దాని ప్రత్యేకత ఉంటుంది. ఏ సినిమా అయినా బాగుంటే ఆడుతుంది, లేదంటే లేదు. నా వరకూ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. శుక్రవారం ఉదయాన్నే షో అయిన తర్వాత ఆడియన్స్ సినిమా హిట్ అన్నారు అంటే అదే పెద్ద సినిమా, అదీ బాలేదు అన్నారు అనుకోండి అది ఫ్లాప్ సినిమా అంతేకంటే ఏమీ ఉండదు. ప్రస్తుతం డైరెక్టర్స్ కంటే ఆడియన్స్ అడ్వాన్స్ గా ఉన్నారు. కావున మా లాంటి డైరెక్టర్స్ వారిని అందుకునేలా సినిమా తీయాలి.

ప్రశ్న) పబ్లిసిటీ వినూత్నంగా చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఎవరిది.?

స) నేనొక పబ్లిసిటీ మార్కెటింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను కాబట్టి నేనే స్వయంగా పబ్లిసిటీ ప్లాన్ చేసుకున్నాం. భారీగా డబ్బు ఖర్చు పెట్టి బ్యానర్స్ కట్టి పబ్లిసిటీ చేసేంత బడ్జెట్ మా దగ్గర లేదు. సో మేము స్మార్ట్ గా ఆలోచించాలి. అలా ఆలోచించే ఈ సినిమా పబ్లిసిటీ చేసాం. రేపు కూడా వినూత్నంగా ఓ ర్యాలీ నిర్వహించనున్నాం.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి ఏమన్నా చెప్తారా.?

స) ప్రస్తుతం ఏమీ లేవండి. ఈ సినిమా సక్సెస్ అయితే నేను మరో సినిమా చేస్తాను. లేదంటే లేదు. ఇండస్ట్రీకి వచ్చి 7 సంవత్సరాలైంది. రైటర్ గా, నిర్మాతగా, డైరెక్టర్ గా పనిచేసా అది చాలు.

ప్రశ్న) మరి ఈ 7 సంవత్సరాల కెరీర్ లో ఏమైనా బాధాకరమైన విషయాలు ఉన్నాయా.?

స) బాధాకరమైన విషయం అంటే ఒకటుంది. అది కూడా నేను తీసుకున్న నిర్ణయం అదే ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమా చెయ్యడం. ఆ సినిమా ఫెయిల్యూర్ కి ఎవరినీ నిందించను. ఎందుకంటే ఒక నిర్మాతగా కథ చెబుతున్నప్పుడు నేను ఏమి చేస్తున్నాను. ఆ సినిమానే నాకు టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పాలి. ఆ ఫెయిల్యూర్ తోనే సినిమా గురించి మరింత తెలుసుకోగలిగాను, ఇప్పుడు ఈ మూవీ తీయగలిగాను.

ప్రశ్న) చివరిగా రిలీజ్ అయిన తర్వాత విమర్శకులు ఇచ్చే పాజిటివ్ లేదా నెగటివ్స్ ని మీరెలా తీసుకుంటారు.?

స) సినిమా చూసాక ప్రతి ఒక్కరూ వారి వారి కోణంలో సినిమా చూస్తారు. సినిమా మొదటి షో పూర్తైన రెండు గంటలకే రిజల్ట్ వచ్చేస్తుంది. ఒక్కొక్కరు సోషల్ మీడియా ద్వారా మనస్కు తెలియని మిస్టేక్స్ లేదా గుడ్ పాయింట్స్ చెబుతారు. ఇవి బాలేదని అన్నారు నుకోండి నెక్స్ట్ టైం మార్చుకుంటా, ఇది బాగుంది అన్నారు అనుకోండి థాంక్స్, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా తీయడానికి ట్రై చేస్తా అని చెబుతాను.. గుడ్ లేదా బాడ్ ఏదైనా స్వీకరిస్తాను.

అంతటితో మహి వి రాఘవ్ తో ఇంటర్వ్యూని ముగించి. ‘పాఠశాల’ సినిమా విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

Exit mobile version