ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ఆనంద్ దేవరకొండ – విజయ్ నా సినిమా స్క్రిప్ట్స్ విషయంలో ఎంటర్ కాడు

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : ఆనంద్ దేవరకొండ – విజయ్ నా సినిమా స్క్రిప్ట్స్ విషయంలో ఎంటర్ కాడు

Published on Nov 18, 2020 5:12 PM IST

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడుగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన యువ హీరో ఆనంద్ దేవరకొండ.ఇప్పుడు తాను హీరోగా నటించిన రెండో చిత్రం “మిడిల్ క్లాస్ మెలోడీస్” ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఆనంద్ నుంచి ఓ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూను తీసుకున్నాం. మరి ఆనంద్ ఎలాంటి విషయాలను పంచుకున్నాడో ఇపుడు చూద్దాం.

మీ మొదటి సినిమా ఒక ఫెయిల్యూర్. అప్పుడు ఎలా ఫీలయ్యారు?

నేను కాస్త డిజప్పాయింట్ అయ్యాను. మంచి సబ్జెక్ట్ అండ్ నరేషన్ ఉంది. బహుశా ఇప్పుడున్న జెనరేషన్ కు ఈ స్టోరీ నచ్చి ఉండదు. నా వరకు ఎంతైతే చేయగలనో అంతా చేశాను, కానీ ప్రతీది మన చేతిలో ఉండదుగా.

మరి మిడిల్ క్లాస్ మెలోడీస్ రిలీజ్ పై ఎలా ఉన్నారు?

ఈ సినిమా విషయంలో మొత్తం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రతీ ఒక్కరికీ మా సినిమా నచ్చుతుంది. మా సినిమాలో కామెడీ, ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషన్స్ తో ఉంటుంది. అలాగే నా రోల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

మీ రోల్ కోసం ఏమన్నా చెప్తారా?

వర్ష అనే అమ్మాయితో లవ్ లో పడే ఒక చిన్న టౌన్ లో ఉండే యువకుడిగా కనిపిస్తాను. కొన్ని పరిస్థితుల వల్ల గుంటూరు వచ్చి ఒక హోటల్ పెట్టాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఎదురయ్యే సమస్యలు ఎదుర్కొన్నాడో అనే రోల్ లో కనిపిస్తాను.

గుంటూరు యువకుడిగా నటించడం ఏమన్నా కష్టం అనిపించిందా?

నా రోల్ సింపుల్ అండ్ డీసెంట్ గా ఉంటుంది. కానీ గుంటూరు యాస మాట్లాడ్డానికి మాత్రం కాస్త గట్టిగానే కష్టపడ్డాను. కానీ మా డైరెక్టర్ కు నా రోల్ విషయంలో అన్ని ఎమోషన్స్ పట్ల క్లారిటీ ఉంది. సో అలా మా డైరెక్టర్ విజన్ తో అలా ఫ్లో లో వెళ్ళిపోయా.

డైరెక్టర్ వినోద్ కోసం చెప్పండి!

గుంటూరులో ఉన్న వారు చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. మా దర్శకుడు కూడా అక్కడ నుంచే వచ్చారు కాబట్టి ఈ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్ ను రాబట్టాలో బాగా తెలుసు కాబట్టి వాటిని రాబట్టగలిగారు. అలాగే అనవసర సన్నివేశాలు ఏం లేకుండా మంచి పంచ్ లతో తీశారు. నాకు కూడా గుంటూరులో షూటింగ్ చెయ్యడం చాలా బాగా అనిపించింది.

మీరు ఇంకా సెటిల్డ్ హీరో కాదు మరి స్క్రిప్ట్స్ ఎలా ఎంచుకొంటున్నారు?

నేను ముందు చెప్పినట్టుగానే నేను జస్ట్ డైరెక్టర్ నటుణ్ని మాత్రమే నేను ఎంత వరకు నటించగలనో ఎలా చేయగలనో నాకే తెలుసు. అలాగే నా చిత్రాల్లో సహజమైన పాత్రలు, మంచి కంటెంట్ ఉండేలా చూసుకొంటున్నాను. అలాగే కాస్త రియలిస్టిక్ గా ఉంటే నా టాలెంట్ ను మరింత ప్రూవ్ చెయ్యడానికి కూడా ఎదురు చూస్తున్నాను.

మీ ప్రాజెక్ట్ ల విషయంలో విజయ్ దేవరకొండ ఎలాంటి హెల్ప్ చేస్తారు?

నా సినిమాల స్టోరీ సెలక్షన్ లో విజయ్ అసలు ఎంటర్ అవ్వడు. తాను తన సినిమా స్టార్ట్ చేసాక ఎండ్ అయ్యే వరకు వదలడు. అలాగే నా సినిమా విషయంలో ఎక్కడెక్కడ తప్పులు చేసానో అవి మాత్రం ప్రతీది ఖచ్చితంగా చెప్తాడు.

విజయ్ తమ్ముడిగా మీకున్న పెద్ద నిరాశ కలిగించే అంశం ఏంటి?

ఖచ్చితంగా అది కంపారిజాన్ అనే అంటాను. ఎందుకంటే అతను ఇప్పుడు ఒక స్టేజ్ కు వచ్చి పాన్ ఇండియన్ హీరోగా మారాడు. ఇక అక్కడ నుంచి నేను జనరల్ ఆడియెన్స్ లో అండ్ మిగతా చాలా మందిలో కంపేరిజన్ ను చూసాను. ఇది బాగా డిజప్పాయింట్ అనిపించింది. కానీ విజయ్ తమ్ముడిగా ఉండడం అనేది కూడా నాకు ఇండస్ట్రీలో బాగా హెల్ప్ అయ్యింది.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

నేను రెండు సినిమాలు ఓకే చేశాను వాటిలో ఒకటి షూట్ కూడా స్టార్ట్ అయ్యింది. అందులో ఒక గవర్నమెంట్ టీచర్ గా కనిపిస్తాను. అది కూడా చాలా సహజంగా అనిపిస్తుంది. ఇలా మంచి ఆఫర్స్ తో మరిన్ని సినిమాలు చెయ్యాలి అనుకుంటున్నాను.

ఇక ఫైనల్ గా సినిమాలోని హైలైట్స్ కోసం ఏమన్నా చెప్తారా?

మా సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. రొమాన్స్, డ్రామా, కామెడీ మంచి టౌన్ సెటప్ నటీనటులు కథనం అంత చాలా బాగుంటుంది. అలాగే లాక్ డౌన్ లో చాలానే చేసాము. ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా ఒక కొత్త ఫ్రెష్ ఫీల్ ను ప్రతీ ఒక్కరికీ అందిస్తాయి.

ఇలా ఆనంద్ దేవరకొండతో మా ఇంటర్వ్యూను ముగించాము. అలాగే తన సినిమాకు అండ్ తన కెరీర్ కు కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు