అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగార్జున నట వారసుడిగా యంగ్ హీరో అఖిల్ అక్కినేని త్వరలో సోలో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఇదే విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ఎప్పుడో తెలియజేడమే కాకుండా ‘మనం’ సినిమాతో అఖిల్ ని అఫీషియల్ గా లాంచ్ చేసారు. అప్పటి నుంచి అఖిల్ చేయనున్న మొదటి సోలో హీరో సినిమాపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే అఖిల్ మొదటి సినిమా విషయంలో పలువురు డైరెక్టర్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఏవీ ఖరారు కాలేదు. ఈ విషయంలో మీకు మేము ఓ ప్రత్యేకమైన న్యూస్ ని అందిస్తున్నాం. మాకు అందిన అధికారిక సమాచార్మ ప్రకారం అఖిల్ మొదటి మూవీని కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా అనౌన్స్ చేసే అవకాసహం ఉంది.


