“ఆదిపురుష్” ఆల్బమ్ పై పెరుగుతున్న అంచనాలు.!

Published on Jun 11, 2021 11:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస పాన్ ఇండియన్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటిస్తున్నాడు. అయితే ఈ భారీ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తారు అన్న ప్రశ్నపై ఇటీవలే సమాధానం దొరికింది.

ఈ చిత్రానికి గాను బాలీవుడ్ క్రేజీ మ్యూజికల్ కాంబో సచేత్ అండ్ పరంపర సంగీతం అందిస్తున్నారని తెలిసింది. అయితే వారు ఎవరు ఎలాంటి ఆల్బమ్స్ ఇచ్చారు అని అంతా ఆరాలు తీయగా సినిమాలు పక్కన పెడితే వారు ఇచ్చిన డివోషనల్ ఆల్బమ్స్ విని ఒక్కొక్కరు బ్లాక్ అవుతున్నారు. దీనితో ఆదిపురుష్ లాంటి చిత్రానికి వారు అయితేనే కరెక్ట్ అని ఇక్కడ తెలుగు ఆడియెన్స్ కూడా ఒక అభిప్రాయానికి వస్తున్నారు. దీనితో ఇపుడు ఆదిపురుష్ ఆల్బమ్ పై సాలిడ్ అంచనాలు ఏర్పడుతున్నాయి.

సంబంధిత సమాచారం :