అంచనా – భీమ్ టీజర్ దగ్గరదగ్గరా ఇలా ఉండొచ్చు.!

అంచనా – భీమ్ టీజర్ దగ్గరదగ్గరా ఇలా ఉండొచ్చు.!

Published on Oct 22, 2020 7:06 AM IST

ఇప్పుడు యావత్తు భారత సినీ ఇండస్ట్రీలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై దర్శక ధీరుడు రాజమౌళి ప్లాన్ చేసిన టీజర్ మోస్ట్ హాట్ టాపిక్ అంశంగా నిలిచింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కలయికలో రాజమౌళి తెరకెక్కిస్తున్న మహా యాగం “రౌద్రం రణం రుధిరం” నుంచి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పై కట్ చేసిన టీజర్ ను ఇండియన్ ఫిల్మ్ లవర్స్ ఇంకొన్ని గంటల్లో విట్నెస్ చేయనున్నారు.

అయితే ఈ టీజర్ పై మాత్రం కనీ వినీ ఎరుగని రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈ టీజర్ ఎలా ఉంటుంది తారక్ ఎలా కనిపిస్తాడు అన్న అంశాలు సర్వత్రా ఆసక్తి నెలకొల్పుతున్నాయి. అయితే మాస్ ఎలివేషన్ సీన్స్ మరియు చరణ్ వాయిస్ ఓవర్ అలాగే తారక్ స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ లు పక్కన పెడితే ఈ సినిమాను మొదటి నుంచీ గమనిస్తే ఒక్క ఎలిమెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని చెప్పాలి.

ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలలో నిప్పు మరియు నీరు ఈ రెండు ఎంత అత్యంత శక్తివంతమైనవో అందరికీ తెలుసు. ఈ రెండు ఒకదానికి ఒకటి పూర్తి భిన్నం. అలాంటి రెండు శక్తివంతమైన అంశాలకు ప్రతీకగా ఈ ఇద్దరినీ మొట్టమొదటి పోస్టర్ నుంచి రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్నారు. అది మనం గమనించొచ్చు. అలాగే మోషన్ పోస్టర్ టీజర్ లో కూడా నిప్పు నుంచి అల్లూరి నీటి నుంచి భీమ్ లను పరిచయం చేసారు.

ఇక అల్లూరిగా చరణ్ ను ప్రెజెంట్ చేసిన టీజర్ కట్స్ లో అయితే స్క్రీన్ అంతా అగ్ని జ్వాలాలతో చరణ్ ను చూపిస్తారు అలాగే అందులో ఆ షాట్స్ విజన్ గమనిస్తే కాంతిలానే కనిపిస్తుంది. ఇప్పుడు అదే రీతిలో భీమ్ గా తారక్ ను చూపే టీజర్ లో ఈ నీటికి ప్రతీకగా ఎక్కువ షాట్స్ ను చూపిస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు అంతే కాకుండా విజన్ కూడా బ్లూ గా ఉండొచ్చు..అందుకు ఉదాహరణగా నిన్న చరణ్ టీజ్ చేసిన వీడియో క్లిప్ లో నీటి నుంచి ఈటెను తీసే సన్నివేశం చూస్తేనే అర్ధం అవుతుంది.

సో ఈ రకంగా పంచభూతాలలో అత్యంత శక్తివంతమైన రెండు బ్రహ్మాండాలకు ప్రతీకగా అత్యంత శక్తివంతంగా రాజమౌళి ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులును పూర్తిగా కొత్త కోణంలో చూపే ప్రయత్నమే ఈ “రౌద్రం రణం రుధిరం” కావచ్చు. మరి కొమరం భీమ్ టీజర్ లో రాజమౌళి ఈ అంశాన్ని చూపించారా లేదా అన్నది ఇంకొద్ది సేపట్లో తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు