స్టేజ్‌పై ఎమోషనలై ఏడ్చేసిన రష్మీ..!

స్టేజ్‌పై ఎమోషనలై ఏడ్చేసిన రష్మీ..!

Published on Aug 30, 2021 9:34 PM IST

Jabardast 3

ఈటీవీలో ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులను నవ్వులు పూయిస్తున్న కార్యక్రమం ఎక్స్‌ట్రా జబర్దస్త్. శుక్రవారానికి ఈ కార్యక్రమం 350వ ఎపిసోడ్‌కి చేరుకోబోతుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కి సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. అయితే ఓవైపు ఎంటర్‌టైన్, మరోవైపు కంటతడి పెట్టించే సన్నివేశాలు ప్రోమోలో కనిపిస్తున్నాయి. పలువురు నటులు తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో వచ్చి డైలాగ్‌లను పేల్చుతూనే, వారి బాధలు చెప్పుకుని కంటతడి పెట్టించారు.

అయితే రాకింగ్‌ రాకేశ్‌, రోహిణి భార్యభర్తలుగా చేసి తమదైన కామెడీతో అల్లరి చేయగా, బుల్లెట్‌ భాస్కర్‌, వర్ష జోడీ అదరగొట్టింది. బజర్దస్త్‌ ఆర్టిస్టుల లైఫ్‌ జర్నీ స్కిట్‌ పేరుతో తాను ఎదుర్కొన్న అవమానాలను నరేశ్ చూపించిన విధానం మనసులను హత్తుకోగా, సుడిగాలి సుధీర్‌, గెటప్ శ్రీను పడిన కష్టాలను కెవ్వు కార్తీక్‌, ఇమ్మాన్యుయేల్‌ చూపించిన విధానం కంటతడి తెప్పించింది. ఈ క్రమంలోనే స్టేజ్‌పై యాంకర్ రష్మీ ఒకింత ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టేసుకుంది. మరీ ఈ ఎపిసోడ్‌ను మిస్ కాకుడదంటే వచ్చే శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను తప్పక చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు