SR కళ్యాణ మండపం కి పెరుగుతున్న షో లు!

SR కళ్యాణ మండపం కి పెరుగుతున్న షో లు!

Published on Aug 8, 2021 3:37 PM IST

కిరణ్ అబ్బవరం మరియు ప్రియాంక జవాల్కర్ కలిసి జంటగా నటించిన తాజా చిత్రం SR కళ్యాణ మండపం. అయితే ఈ చిత్రం ఆగస్ట్ 6 న థియేటర్ల లో విడుదల అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రెండు రోజులు థియేటర్ల వద్ద ప్రేక్షకులు ఎక్కువగా ఉండటం తో ఈ సినిమా కి షో ల ను పెంచినట్లు తెలుస్తోంది. ఆడియెన్స్ ఎక్కువగా వస్తుండటం మాత్రమే కాకుండా సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం తో సినిమా కి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ చిత్రం కి కథ కిరణ్ అబ్బవరం అందించగా, శ్రీధర్ గాదె చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రమోద్ మరియు రాజు లు నిర్మించడం జరిగింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలపడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు