గీత గోవిందం కలక్షన్స్ ను క్రాస్ చేయనున్న ఎఫ్ 2 !

Published on Jan 23, 2019 11:17 am IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఇటీవల విడుదలై తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈచిత్రం 11 వరోజు నైజాం లో 70లక్షల షేర్ ను రాబట్టింది. ఇక కేవలం 11 రోజుల్లోనే ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా 64కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. దాంతో ఈ చిత్రం ఫుల్ రన్ లో గీత గోవిందం (70కోట్లు) కలక్షన్స్ ను క్రాస్ చేయనుంది.

ఇటీవల వరస పరాజయాలతో డీలాపడ్డ దిల్ రాజు కు ఈచిత్రం ఊహించని విజయాన్ని అందించింది అలాగే విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లకు ఈ చిత్రం కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ను అందించింది. ఇక ఈచిత్రంతో అనిల్ రావిపూడి వరుసగా నాలుగు విజయాలను అందుకున్నాడు. ఆయన కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంకూడా ఇదే కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More