యు ట్యూబ్ లో “ఎఫ్ 2” మూవీ కాకపోతే… !

Published on Jul 14, 2019 6:11 pm IST

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాలలో వెంకటేష్,వరుణ్ తేజ్ కాంబినేషన్ లో మల్టీ స్టార్టర్ గా విడుదలైన “ఎఫ్2” చిత్రం ఘనవిజయం అందుకుంది. రెండు “ఎన్టీఆర్”,”వినయవిధేయరామ” వంటి రెండు భారీ చిత్రాలతో పోటీపడి మరి “ఎఫ్2” క్లియర్ 2019 సంవత్సరానికి గాను సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. పెళ్ళాల చేతిలో చిత్రహింసలు పడే భార్యా బాధితులైన భర్తలుగా వరుణ్ తేజ్, వెంకటేష్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఫ్యామిలీ హీరో వెంకటేష్ నుండి చాలా కాలం తరువాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచినట్లయింది.

నేటి నుండి ఈ చిత్రం హిందీ వర్షన్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండనుంది. ఆదిత్య మ్యూజిక్& ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వర్షన్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం జరిగింది. దీనితో హిందీ ప్రేక్షకులుకూడా వెంకీ,వరుణ్ ల ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చూసి ఎంజాయ్ చేయనున్నారు. తెలుగులో థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ, ఇక యూట్యూబ్ లో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమన్నా,మెహ్రిన్ హీరోయిన్లుగా నటించారు.

మూవీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More