హ్యాట్రిక్ విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో అగ్ర హీరో విక్టరీ ‘వెంకటేశ్, యువ హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్ లైన్ . ప్రస్తుతం ఈచిత్రం యొక్క షూటింగ్ చెక్ రిపబ్లిక్ దేశంలోని ఫ్రాగ్ లో జరుగుతుంది. దాదాపు 10రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో హీరో హీరోయిన్ల ఫై ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈచిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది.


