ఫన్ రైడ్ గా రాబోతున్న ‘ఎఫ్ 2’ టీజర్ !

ఫన్ రైడ్ గా రాబోతున్న ‘ఎఫ్ 2’ టీజర్ !

Published on Dec 10, 2018 9:02 PM IST


విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కలయికలో వస్తోన్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). ఈ చిత్రం ఒక్క పాట మినహా మిగతా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్ర టీజర్ ను వెంకీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.

అయితే ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేస్తూ.. టీజర్ ఫుల్ ఫన్నీ గా ఉంటుందని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి హాస్యభరితంగా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందింస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు