నైజాంలో మ్యాజిక్ ఫిగర్ ను అందుకోనున్న ఎఫ్ 2 !

Published on Jan 26, 2019 9:56 am IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్ 2 మరో సాలిడ్ రికార్డు ను నెలకొల్పనుంది. ఫుల్ రన్ లో ఈచిత్రం నైజాంలో 22కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది. ఇక 13వరోజు ఈ చిత్రం అక్కడ 70లక్షల షేర్ ను రాబట్టింది. అలాగే యూ ఎస్ లో రాత్రి 7:30 గంటల వరకు ఈ చిత్రం 66 లొకేషనల్లో కలిపి 14 వేల డాలర్లను కలెక్ట్ చేసింది. ఇక ఈ వారాంతం లో కూడా ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్లను రాబట్టకోనుంది.

ఈ చిత్రం మల్టీ స్టారర్ చిత్రాల్లో 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన తొలి చిత్రం గా రికార్డు సృష్టించింది అలాగే వెంకీ , వరుణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈసినిమా సంక్రాంతికి విడుదలై డబుల్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా , మెహ్రీన్ లు కథానాయికలుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More