ఎఫ్ 2 టీజర్ టాక్ – ఫుల్ గా నవ్వించడం గ్యారెంటీ !

Published on Dec 12, 2018 5:51 pm IST

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ టీజర్ ను వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. ఇక టీజర్ తో సినిమా ఎలా వుండబోతుందో చెప్పేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ టీజర్ ను పూర్తిగా ఫన్ తో నింపేసాడు.

ఇక కామెడీ కి కేరాఫ్ అడ్రస్ అయినా వెంకీ ఇటీవల కాలంలో తన గత చిత్రాలతో అయన ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్ చేయలేక పోయాడు. కానీ ఈ చిత్రం తో ఆ లోటును భర్తీ చేస్తూ మళ్ళీ పాత వెంకీ ని గుర్తుచేస్తున్నాడు. ముఖ్యంగా వెంకీ తో వరుణ్ కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. తమన్నా,మెహ్రీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రానుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొనేలా వున్నాడు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More