ఎఫ్ 2, వివిఆర్, ఎన్టీఆర్ కథానాయకుడు కృష్ణా కలెక్షన్స్ !

Published on Jan 23, 2019 9:49 am IST


వెంకటేష్ , వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్ 2 కృష్ణా జిల్లాలో మంగళవారం 11.98లక్షల షేర్ ను రాబట్టి 11 రోజులకుగాను అక్కడ 4.08 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ రోజుతో ఈ చిత్రం అక్కడ 5కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

ఇక వినయవిధేయరామ, కృష్ణా లో మంగళవారం కేవలం 1.12 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టి బాక్సాఫిస్ వద్ద చేతులెత్తేసింది. 12రోజులకుగాను ఈ చిత్రం అక్కడ 3.68 కోట్ల షేర్ ను రాబట్టింది.

అలాగే బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్ల విషయంలో లో ఏ మార్పు రావడం లేదు. నిన్న ఈ చిత్రం కృష్ణా లో కేవలం 35,003 వసూళ్లను రాబట్టిందంటే ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 14రోజుల్లో ఈ చిత్రం అక్కడ 1.38కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.

సంబంధిత సమాచారం :

X
More