మొదలైన “ఎఫ్3” మరియు “బీస్ట్” చిత్రాల షూటింగ్!

Published on Jul 1, 2021 12:42 pm IST

కొత్త చిత్రాల షూటింగ్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం కాస్త పరిస్థితులు చక్కబడటం తో పలు చిత్రాల షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది. అయితే తెలుగు లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 3 చిత్రం ను దర్శకుడు అనిల్ రావిపూడి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఈ చిత్రం లో హీరో లు గా నటిస్తున్నారు. తమన్నా భాటియా, మెహ్రిన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నేడు మొదలైంది.

అయితే తమిళ నటుడు విజయ్ హీరో గా, పూజా హెగ్డే హీరోయిన్ గా కలిసి నటిస్తున్న బీస్ట్ చిత్రం షూటింగ్ నేడు మొదలైంది.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం లో యోగి బాబు, వి టీవీ గణేష్, అపర్ణ దాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :