రజినీతో కలిసి నటించనున్న ప్రముఖ నటుడు ?

రజినీతో కలిసి నటించనున్న ప్రముఖ నటుడు ?

Published on Jul 13, 2018 10:40 PM IST

Fahad Fazil
సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం’ఫిజ్జా’ ఫెమ్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇక ఈ చిత్రం లో ప్రముఖ మళయాళ నటుడు జాతీయ అవార్డు గ్రహీత ఫహద్ ఫాసిల్ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఆయన రజినీ స్నేహితుడి పాత్రను చేయనున్నారు. సినిమాకు సంభందించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన పాత్ర కీలకం కానుంది. అయితే ప్రస్తుతం ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నందున ఈ అవకాశాన్ని తిరస్కరించే ఛాన్స్ కూడా ఉందంటున్నారు కోలీవుడ్ సినీ వర్గాలు.

ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన డార్జిలింగ్ షెడ్యూల్ ముగిసింది. విజయ్ సేతుపతి , బాబీ సింహ , యోగి బాబు , మేఘా ఆకాష్ మొదలగువారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు