అల్లు అర్జున్ విలన్ “మాలిక్” విడుదల కి డేట్ ఫిక్స్!

Published on Jul 1, 2021 7:48 pm IST


విలక్షణ నటుడు గా సౌత్ సినీ పరిశ్రమ లో పేరు తెచ్చుకున్న నటుడు ఫాహద్ ఫజిల్. ఫాహడ్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం మాలిక్. మహేష్ నారాయణన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ప్రైమ్ వీడియో లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. జూలై 15 వ తేదీన ఈ చిత్రం ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కానుంది. ఆంటో జోసెఫ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం లో నిమిష సజాయన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం లో దిలీష్ పోతన్, జోజు జార్జ్, దివ్య ప్రభ, మీనాక్షి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఫాహద్ ఫజిల్ ఇటు అల్లు అర్జున్ చిత్రం పుష్ప లో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతుంది. ఈ చిత్రం తో టాలీవుడ్ కి ఫాహద్ పరిచయం కానున్నారు.

సంబంధిత సమాచారం :