ఆకట్టుకుంటున్న ఫాహద్ “మాలిక్” ట్రైలర్!

Published on Jul 6, 2021 5:05 pm IST

మళయాళ చిత్ర పరిశ్రమ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫాహద్ ఫాసిల్. ఫాహద్ తాజాగా నటిస్తున్న చిత్రం మాలిక్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని డైరక్ట్ ఆన్లైన్ ద్వారా ఈ నెల 15 వ తేదీన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నేడు ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ట్రైలర్ విడుదల చేయడం తో అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

క్రైమ్ డ్రామా గా తెరకక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ నారాయణన్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఫాహాద్ తెలుగు లో పుష్ప చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో విలన్ పాత్ర లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా పుష్ప తెరకెక్కుతుంది. అయితే అల్లు అర్జున్ సినిమా లో విలన్ కావడం తో తెలుగు ప్రేక్షకులు సైతం మాలిక్ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

సంబంధిత సమాచారం :