ఫలక్ నుమా దాస్-2 కూడా అట !

Published on Jun 7, 2019 10:40 pm IST

విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా – హీరోగా, కరాటీ రాజు నిర్మాణంలో వచ్చిన చిత్రం ‘ఫలక్ నును దాస్’. హర్షిత గౌర్, సలోని మిశ్రా హీరోయిన్స్ గా నటించగా, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. కాగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదల అయిన ఈ చిత్రం.. నైజాంలో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది.

ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రంలో నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ… ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. 50 థియేటర్స్ తో పాటు మల్టిప్లెక్స్ లు కూడా పెరుగుతున్నాయి. ఇక మా నెక్స్ట్ చిత్రం ఫలక్ నుమా దాస్ 2 తో భారీ క్యాస్టింగ్ తో మరోసారి మీ ముందుకు వస్తామని తెలిపారు. మొత్తానికి ‘ఫలక్ నును దాస్ 2’ కూడా రాబోతుంది అన్నమాట.

సంబంధిత సమాచారం :

More