ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘ఫలక్ నుమా దాస్’ !

ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘ఫలక్ నుమా దాస్’ !

Published on May 13, 2019 11:15 AM IST

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం దర్శకుడిగా మారాడు యంగ్ హీరో విశ్వక్‌సేన్‌. విశ్వక్ సేన్ దర్శకత్వంలో ‘ఫలక్ నుమా దాస్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

కాగా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఫలక్నుమా అనే ఏరియాలో శంకరన్న అనే వ్యక్తిని చూసి.. చిన్నప్పడే అతనిలా ఓ గ్యాంగ్ ని పెట్టాలని నిర్ణయించుకునే దాస్ అనే ఓ కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ లో ప్రేమ మరియు ఫ్రెండ్షిప్ తాలూకు ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశారు. మొత్తానికి నెటిజన్లను ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది.

హైదారాబాద్ ఓల్డ్ సిటీలోని ఫలక్ నుమా, లాల్ దర్వాజా వంటి ప్రాంతాల్లో రూపొందించిన ఈ చిత్రంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా యస్.ఐ పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తోన్న యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ కు గతంలో షార్ట్‌ ఫిలింస్‌ ను తీసిన అనుభవం ఉంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు