నెట్ ఫ్లిక్స్ కోసం “ఫ్యామిలీ మ్యాన్”..వారి క్రేజీ రిప్లై చూడండి.!

Published on Jun 9, 2021 7:59 am IST

ప్రస్తుతం ఇండియన్ ఎంతగానో అలరిస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ సీక్వెల్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ప్రైమ్ వీడియోలో అదరగొడుతుంది. స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని మరియు మెయిన్ లీడ్ మనోజ్ బాజ్ పై లు చేసిన రాజీ అండ్ శ్రీకాంత్ రోల్స్ కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు.

అయితే ఇపుడు ఈ ఫ్యామిలీ మ్యాన్ రోల్ చేసిన మనోజ్ బాజ్ పై ప్రైమ్ వీడియో నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఒక అదిరే సిరీస్ చేసేందుకు సంప్రదించబడ్డారని తాము ఆ సిరీస్ కోసం ఈ ఫ్యామిలీ మ్యాన్ ను ఆహ్వానిస్తున్నామని నెట్ ఫ్లిక్స్ ఇండియా వారు ట్వీట్ పెట్టగా.. తమ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ నటుడు నెట్ ఫ్లిక్స్ లోకి వెళ్తుండడంతో ప్రైమ్ వీడియో వారు కూడా క్రేజీ రిప్లై ఇచ్చారు.

ఫ్యామిలీ మ్యాన్ లో శ్రీకాంత్ ఎలా అయితే తన జాబ్స్ మార్చుకుంటున్నాడో అలానే ఇపుడు శ్రీకాంత్ ఉద్యోగాల మార్పులో ఇంకా ఎం=పెద్ద చేంజ్ వచ్చింది కదా అని వారికి రిప్లై ఇచ్చారు. దీనితో సోషల్ మీడియా ఓటిటి వీక్షకులు ఈ రెండు దిగ్గజ సంస్థల కాన్వర్జేషన్ కోసం మాట్లాడుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :